బాలీవుడ్‌లో బయోపిక్ ట్రెండ్ భీబత్సంగా నడుస్తుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి సంబంధించి వరుస బయోపిక్‌లు రూపొందుతున్న క్రమంలో తాజాగా టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కనుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే తన జీవిత నేపథ్యంలో బయోపిక్ తెరకెక్కనుందనే వార్తని ఓ భేటిలో సానియా కన్‌ఫాం చేసినప్పటికి, ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే సానియా పాత్రలో కరీనా కపూర్ నటించనున్నట్టు ఓ టాక్ నడుస్తుంది.
క్రీడాకారుల ప్రవర్తన, కఠోర శ్రమ, తల్లిదండ్రుల త్యాగం వంటివి చాలా మందికి తెలియడం లేదు. కేవలం గ్లామర్‌ని మాత్రమే చూస్తున్నారు. నా బయోగ్రఫీతో తెరకెక్కనున్న చిత్రంలో నేను భాగం కావాలని భావిస్తున్నాను అని సానియా పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, పీవీ సింధు, మహిళా క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ వంటి క్రీడాకారిణుల బయోపిక్‌లు కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.