వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. సమావేశానికి వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌కు సంబంధించి చేపట్టిన ముందస్తు చర్యలపై మంత్రి భేటీలో చర్చించనున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులతోనూ మంత్రి సమావేశం కానునున్నారు. కరోనా వైరస్ ప్రభావం తెలంగాణలో ఎక్కడా నిర్ధారణ కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనాపై వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి శంషాబాద్ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల భేటీ