సీఎం వినతి మేరకే ఆ పేరాను చదువుతున్నా : కేరళ గవర్నర్‌

కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు ఆ రాష్ట్ర శాసనసభలో అనుహ్య పరిణామాలు ఎదురయ్యాయి. కేరళ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్‌ ప్రసంగ పాఠాన్ని చదివేందుకు ఆయన శాసనసభకు వచ్చారు. సీఏఏకు అనుకూలంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ సభ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్‌ సభ్యులు నినాదాలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సీఎం పినరయి విజయన్‌, స్పీకర్‌ శ్రీరామకృష్ణన్‌ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వినలేదు. ఈ క్రమంలో మార్షల్స్‌.. గవర్నర్‌కు రక్షణగా నిలబడి చైర్‌ వద్దకు తీసుకెళ్లారు. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం కాగానే యూడీఎఫ్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.