భారత్‌లో 24 గంటల్లో 83 మంది మృతి

 భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తూనే ఉంది. దేశంలో 24 గంటల వ్యవధిలో 2573 కొత్త కేసులు నమోదు కాగా 83 మంది చనిపోయారు. ఇంతవరకు ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కాలేదు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 42836కు పెరిగింది. 


ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 29685 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 11762 మంది కోలుకున్నారు. కరోనా వల్ల 1389 మంది మరణించారు.  మహారాష్ట్ర(12974), గుజరాత్‌(5428), ఢిల్లీ(4549), తమిళనాడు(3023) రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.