బీహార్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ కేసులతో బీహార్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 523కు చేరుకున్నట్లు వైద్యారోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.
ఆరుగురు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో వారి వివరాలు తెలుసుకుని క్వారంటైన్ లో ఉంచినట్లు తెలిపారు. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తున్నారు.